: హైదరాబాద్ లో ఇళ్ల ధరలు తగ్గాయి


హైదరాబాద్ లో ఇళ్ల ధరలు తగ్గాయట. ఇదేదో ఉమ్మడి రాష్ట్ర విభజన ప్రభావం వల్లే జరిగిందేమీ కాదు. 2007-13 మధ్య కాలంలో దేశంలోని వివిధ నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలపై నిర్వహించిన ఆర్థిక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం... మొత్తం 24 నగరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు పెరగగా, హైదరాబాద్, కొచ్చి నగరాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఇళ్ల ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో 7 శాతం మేర ధరలు తగ్గగా, కొచ్చిలో ఏకంగా 15 శాతం మేర ఇళ్లు, నివాస స్థలాల ధరలు తగ్గిపోయాయట. ఇక ఇళ్ల ధరలు పెరిగిన నగరాల్లో చెన్నై తొలి స్థానంలో నిలిచింది. చెన్నైలో ఈ ఆరేళ్ల కాలంల్లో ఇళ్లు, నివాస స్థలాల ధరలు ఏకంగా 230 శాతం పెరిగాయట. 123 శాతం ధరల పెరుగుదలతో పుణె, 122 శాతం పెరుగుదలతో ముంబై తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News