: ఇసుకతో మొబైల్ బ్యాటరీ
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు... అన్న వాక్యం ఇక్కడ అతికినట్టు సరిపోతుందేమో. ఎందుకంటే, శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇసుకతో మొబైల్ బ్యాటరీ రూపొందిస్తున్నారు. ఈ లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో వినియోగిస్తున్న బ్యాటరీల కంటే మూడురెట్ల అధిక సామర్థ్యం కలిగి ఉంటుందట. దీని తయారీకి తక్కువ వ్యయం మాత్రమే అవుతుందని, విషరసాయనాలు ఉండవని, పైగా, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఇసుకలో ఉండే సిలికాన్ ఈ బ్యాటరీలో శక్తిని ఉత్పత్తి చేస్తుందని వారు వివరించారు.