: ఉలిక్కిపడిన అమెరికా


తుపాకీ సంస్కృతికి ఆలవాలమైన అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. హ్యూస్టన్ శివార్లలో బుధవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. స్ప్రింగ్ ప్రాంతంలో నివాసాలపై కాల్పులు జరిపి ఐదుగురిని పొట్టనబెట్టుకున్నాడు. ఈ కాల్పుల ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసు బలగాల వేట సాగుతోంది.

  • Loading...

More Telugu News