: కేసీఆర్ కు లేఖ రాస్తా... చర్చిద్దాం రమ్మంటా: చంద్రబాబు


విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని... వీటి పరిష్కారాల కోసం చర్చించుకుందామన్నా... ఆ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్తు, సాగునీరు, ఆర్థిక ఇబ్బందులు... ఇలా ఎన్నో సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాదుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాల వీధుల్లో ఫైళ్లు పట్టుకుని తిరిగానని... తెలుగువారంతా నా వాళ్లే అనే భావనతోనే ఇదంతా చేశానని చెప్పారు. అలాంటిది ఇప్పుడు హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వమంటున్నారని... 1956ను స్థానికతకు ప్రామాణికంగా తీసుకుంటామని చెబుతున్నారని... ఇది న్యాయబద్ధమైనదేనా? అని ప్రశ్నించారు. తెలంగాణ నేతల అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారుతుందని చంద్రబాబు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని... చర్చలకు రమ్మని పిలుస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News