: నేడు హస్తిన బయల్దేరుతున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ నేడు హస్తిన బాట పడుతున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లను ఆయన కలుస్తారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులను వీరికి జగన్ వివరిస్తారు. జగన్ తో పాటు పలువురు వైకాపా ముఖ్యనేతలు కూడా ఢిల్లీకి వెళుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్ పరోక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని జగన్ వీరి దృష్టికి తీసుకురానున్నట్టు సమాచారం. ఈరోజు, రేపు ఆయన ఢిల్లీలోనే వుంటారు.