: ఐటీ పరిశ్రమల స్థాపనకు రాయితీలిస్తాం: పల్లె రఘునాథ్ రెడ్డి


ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమల స్థాపనకు రాయితీలిస్తామని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విశాఖ, అనంతపురం, తిరుపతిల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలిస్తామని ఆయన చెప్పారు. ఐటీ పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. విశాఖలోని విప్రో సంస్థలో 7,500, టెక్ మహీంద్రలో 5,000 ఉద్యోగాలు కల్పించనున్నామని ఆయన వెల్లడించారు. ఐటీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News