: ముగ్గురి క్షమాబిక్షలను తిరస్కరించిన రాష్ట్రపతి


ఇద్దరు కరుడుగట్టిన నేరగాళ్ళు. వారిలో ఒకరు 2001 పార్లమెంట్ పై ఉగ్ర దాడికి సూత్రధారి అఫ్జల్ గురు. మరొకరు 2008 నవంబర్ 28న ముంబాయిలోని తాజ్ హోటల్, శివాజీ టెర్మినస్ తదితర ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కనిపించిన వారిని పిట్టల్లా కాల్చి పారేసిన నరరూప రాక్షసుడు పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్. వీరిద్దరికీ మరణ శిక్షే సరైనదని రాష్ట్రపతి ప్రణబ్ భావించారు. రాష్ట్రపతి భవన్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ మాత్రం తటపటాయించకుండా వీరి క్షమాభిక్ష అభ్యర్ధనలను తిరస్కరించారు.

వీరి
తో పాటు మరో దోషి దాఖలు చేసుకున్న పిటిషన్ కూడా రాష్ట్రపతి తిరస్కరణకు గురైంది. కట్టుకున్న భార్యను, రక్తం పంచుకు పుట్టిన 18నెలల వయసున్న కూతురును కర్కోటకంగా అంతం చేసిన కేసులో కర్నాటక రాష్ట్రానికి చెందిన నిగప్ప నాటికర్ కు సుప్రీం కోర్టు మరణ శిక్ష విధించింది. దీనిని మాఫీ చేయాలని అతడు కోరగా రాష్ట్రపతి జనవరి 4న తిరస్కరించారు. దీంతో ప్రణబ్ ఇప్పటివరకూ ముగ్గురు దోషులకు క్షమాబిక్షను తిరస్కరించినట్లు అయింది. 

  • Loading...

More Telugu News