: హైదరాబాదులో ఆంధ్రుల సమస్యలు కేంద్ర హోం మంత్రికి వివరించిన హరిబాబు
హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ హరిబాబు వివరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న బూర్గంపాడు గ్రామాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో కలపాలని కోరామన్నారు. హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది వివరించామన్నారు. హైదరాబాదు శాంతి భద్రతలను గవర్నర్ కు అప్పగించాలని కోరామని ఆయన తెలిపారు.