: వక్కపలుకు మింగిన 8 నెలల బాలుడు మృతి
వక్కపొడి పలుకు గొంతులో అడ్డం పడి, శ్వాస ఆడక ఎనిమిది నెలల బాలుడు మరణించాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు మండలంలో చోటు చేసుకుంది. ఎలకపల్లి (బి) గ్రామానికి చెందిన మల్లేష్, సునీత దంపతుల కుమారుడు కిరణ్ (8 నెలలు) ఆడుకుంటూ... వక్కపొడి పలుకును మింగడంతో అది గొంతులో అడ్డం పడింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న కిరణ్ ను గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచాడు. చిన్నారి ఆకస్మిక మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.