: రైతులెలా కనిపిస్తున్నారు బాబూ?: వైఎస్సార్సీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆంధ్రప్రదేశ్ రైతులు అమాయకుల్లా కనిపిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. హైదరాబాదులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రీషెడ్యూల్ అంటూ కొత్త నాటకానికి నాంది పలికారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులు రీషెడ్యూల్ అంటే ఏంటో తెలియని అమాయకులు కారని, రైతురుణాలు మాఫీ చేస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేసి రైతురుణాలు మాఫీ చేస్తుందో వెల్లడించాలని ఆయన నిలదీశారు. బ్యాంకుల నుంచి రైతులకు 'నో డ్యూస్' సర్టిఫికేట్లను ప్రభుత్వమే ఇప్పించాలని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు సమాధానం కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.