: కేసీఆర్ తో స్వీడన్ ప్రతినిధుల బృందం భేటీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్వీడన్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. హైదరాబాదులో ఫర్నీచర్ షోరూం ఏర్పాటుకు స్వీడన్ దేశానికి చెందిన ఐకియా కంపెనీ ముందుకొచ్చింది. రూ.600 కోట్ల వ్యయంతో షోరూమ్ ఏర్పాటు చేసేందుకు ఐకియా కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు కేటాయించేందుకు భూమి సిద్ధంగా ఉందని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News