: ఆ ఓటమి నా గుండెను బద్దలు చేసిందంటున్న ధనుష్


ఫుట్ బాల్ చరిత్రలో బ్రెజిల్ ది ప్రత్యేక అధ్యాయం. అలాంటి బ్రెజిల్ ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో జర్మనీ చేతిలో ఘోరపరాజయం పాలవ్వడం జీర్ణం కావడం లేదని ప్రముఖ తమిళ హీరో ధనుష్ పేర్కొన్నాడు. ఈ మేరకు ధనుష్ ట్విట్టర్లో బ్రెజిల్ పై తన అభిమానం ప్రదర్శించాడు. తాను బ్రెజిల్ జట్టుకు అభిమానినని, సెమీస్ లో ఓటమితో తన గుండె బద్దలైనంత పని అయిందని అన్నాడు. ఇది హార్ట్ బ్రేకింగ్ మ్యాచ్ అయినప్పటికీ తన ఫేవరేట్ బ్రెజిలేనని ధనుష్ స్పష్టం చేశాడు. కాగా, ధనుష్ ప్రస్తుతం తన రెండో బాలీవుడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News