: జగన్ పై ఆనం వ్యాఖ్యలను సమర్ధించిన బొత్స
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖూనీకోరు, అతనికి ఉరిశిక్ష విధించినా ఫర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమర్ధించారు. ఆనం చేసిన వ్యాఖ్యలు వందశాతం నిజమన్నారు. జగన్, షర్మిలను నమ్మితే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తెచ్చి.. ప్రజలను నిలువునా ముంచుతారని ఘాటుగా విమర్శించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏ తప్పు చేయలేదని అనంతపురంలో బొత్స చెప్పారు.