: నా కంపెనీలను మూసేయండి: రాబర్ట్ వాద్రా


ప్రారంభించిన నాటి నుంచి తన కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలు సాగించడం లేదని, దీంతో వాటిని మూసివేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. 2012లో ప్రారంభమైన తన కంపెనీలు ఇప్పటిదాకా ఎలాంటి కార్యకలాపాలు సాగించలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారానే తాను మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News