: మాకు పెళ్లా.. అంతా చెత్త: సుస్మితాసేన్


పాకిస్థానీ క్రికెటర్ వసీం అక్రంను తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ వచ్చిన వార్తలను 37ఏళ్ల సుందరాంగి సుస్మితా సేన్ ఖండించారు. వాటిని పనికిమాలిన చెత్త వార్తలుగా పేర్కొన్నారు. వసీం తనకొక మంచి ప్రెండని ఎప్పటికీ అలానే ఉంటాడన్నారు. ఈ మేరకు పుకార్లపై ఆమె ట్విట్టర్ లో స్పందించారు. వసీం జీవితంలో అందమైన అమ్మాయికి చోటుందంటూ పోస్ట్ చేశారు. మరోవైపు వసీం కూడా వీటిని ఖండించాడు. తాను తన పిల్లలకే అంకితమని, జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ప్రకటించాడు.

  • Loading...

More Telugu News