: హృతిక్ పారితోషికం రూ. 50 కోట్లట!


బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రంలో పోషిస్తాడని చెబుతున్న పాత్ర అతడికి కాసుల పంట పండించనుందట. అంతేకాదండోయ్, ఆ పాత్ర తెరమీదకొస్తే, బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ల జాబితాలో అగ్రపీఠమెక్కుతాడట. ఇంతకీ విషయమేమిటంటే, ప్రస్తుతం బ్యాంగ్ బ్యాంగ్ చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న హృతిక్ తో సంచలన దర్శకుడు అశుతోష్ గోవారికర్ 'మొహింజదారో' చిత్రం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ చిత్రానికి గాను అతడికి రూ. 50 కోట్ల మేర రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు అశుతోష్ సిద్దపడ్డట్లు బాలీవుడ్ టాక్. అయితే ప్రస్తుతం కత్రినా కైఫ్ తో కలిసి చేస్తున్న 'బ్యాంగ్ బ్యాంగ్'పై గంపెడాశలు పెట్టుకున్న హృతిక్ కు, ఆ చిత్రం ఏ మేరకు సక్సెస్ ను ఇస్తుందో చూద్దాం.

  • Loading...

More Telugu News