: స్మార్ట్ ఫోన్ తో బ్రష్ చేసుకోండి
స్మార్ట్ ఫోన్ తో బ్రష్ చేసుకోండి...అంటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే...బుర్రేమైనా పోయిందా? అంటూ అనుమానం వస్తుంది. మీకా అనుమానం అక్కర్లేదు. కొత్తగా మార్కెట్లోకి బ్లూటూత్ బ్రష్ విడుదలైంది. బ్రష్ ఎలా వాడాలో, మీ పళ్ల సందుల్లో ఎలా క్లీన్ చేసుకోవాలో మీ స్మార్ట్ ఫోన్ చెబుతుంది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించారు. ఇది కేవలం రెండంటే రెండే నిమిషాల్లో మొత్తం పళ్లను శుభ్రం చేసి, ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తుంది. మరి దీని హెడ్ పాడైపోతేనో అనే అనుమానం వచ్చిందా? దీని హెడ్స్ మార్చుకోవచ్చు. దీనిని చార్జింగ్ చేసుకునేందుకు ఛార్జర్, పళ్లు తోముకునేందుకు, నాలుక గీసుకునేందుకు మొత్తం ఆరు స్విచ్ లు ఉంటాయి. మీరు స్విచ్ ఆన్ చేసి తోముకుంటుంటే మీరు ఎలా బ్రష్ చేస్తున్నారనేది మీ స్మార్ట్ ఫోన్ చూపిస్తుంది. మీ నోట్లో బ్రష్ ఎంత లోపలికి వెళ్లింది?, ఇంకెంత లోపలికి వెళ్లవచ్చు?, ఎలా తోముతున్నారు? ఎలా తోమాలి? పళ్లపై ఎంత ఒత్తిడి పెడుతున్నారు? ఎంత పెట్టాలి? అనే అన్ని వివరాలు ఈ బ్రష్ వెల్లడిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియాల్లో ఈ బ్రష్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. మన మార్కెట్ లోకి త్వరలో రానుంది.