: ఏపీ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు జైట్లీ, నజ్మా హెప్తుల్లాలకు ఆహ్వానం


ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెల 18, 19 తేదీల్లో సభా వ్యవహారాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నజ్మా హెప్తుల్లాలను ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు కలిశారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు అతిథులుగా రావాలంటూ వారిని ఆయన ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కోడెల భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News