: బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ప్రధాని ప్రశంసలు
బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు అమిత్ షాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా నిస్వార్థ నేత అని ఆయన కొనియాడారు. అమిత్ షా కృషి, పట్టుదలతో కార్యకర్త స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారని ఆయన ప్రశంసించారు. నిబద్ధతతో తన సామర్థ్యాన్ని ఆయన చాలా సార్లు నిరూపించుకున్నారని మోడీ అభినందించారు. ఇంతవరకు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్ నాథ్ సింగ్ కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్ నాథ్ నాయకత్వంలో బీజేపీ ఉన్నత స్థానాలు అధిరోహించిందని ఆయన ట్వీట్ చేశారు.