: ఫైజాబాద్ కోర్టులో కాల్పులు- ఇద్దరు మృతి
ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ కోర్టులో బుధవారం కాల్పులు, అనంతరం పేలుడు ఘటనలు వెంటవెంటనే చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తొలుత కోర్టు హాలులో కాల్పులు చోటుచేసుకున్న అనంతరం కోర్టు ప్రాంగణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనల నేపథ్యంలో కోర్టులో న్యాయవాదులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. యూపీ మాజీ ఎమ్మెల్యే, అతడి అనుచరులపై కోర్టు హాలులో కాల్పులు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.