: దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వస్తాం: బీజేపీ
దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోను బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ బీజేపీ నేతలు, ఆయన సమర్థుడైన నాయకుడు అని శ్లాఘించారు. అమిత్ షా సారధ్యంలో బీజేపీ దేశంలో మరింత బలంగా వేళ్లూనుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.