: నేవీ అధికారి భార్య ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నాం: ఆంటోనీ


నేవీ అధికారులలో భార్యల మార్పిడి పెద్ద ఎత్తున కొనసాగుతోందంటూ ఓ అధికారి భార్య బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. తన భర్త ఉన్నతాధికారి భార్యతో గడుపుతుండగా చూశానని, నిలదీస్తే తనను వేధించారంటూ కోచికి చెందిన ఒక అధికారి భార్య సుమేధ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు కోచికి వచ్చిన సందర్భంగా రక్షణ మంత్రి ఆంటోనీ స్పందించారు. నేవీలో ఇలాంటి వేధింపులను క్షమించే ప్రసక్తే లేదని, విచారణలో తప్పుందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదును చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని చెప్పారు. విచారణ ఇంకా పూర్తికాలేదని చెప్పారు. నేవీ అంతర్గత విచారణతోపాటు, ఢిల్లీ, కోచి పోలీసులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేవీ అధికారిపై ఇప్పటికే వేటు పడింది.

  • Loading...

More Telugu News