: 12న విజయవాడలో బాబుకు సన్మానం: అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఈ నెల 12న విజయవాడలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబును సన్మానిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు 60 ఏళ్ల పదవీ విరమణను వర్తింపజేయవద్దని కోరతామన్నారు. ఉద్యోగులకు కేటాయించిన భూములను రద్దు చేసే అధికారం ఏ ఒక్కరికీ లేదన్న ఆయన, ఈ విషయంలో తెలంగాణ సీఎంను కలిసిన తర్వాత స్పష్టత ఇస్తామని చెప్పారు. విభేదాలు సృష్టిస్తున్న నేతలను ఏపీఎన్జీఓ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.