: బ్రెజిల్ ప్రజలారా...మమ్మల్ని క్షమించండి: కన్నీళ్లు పెట్టుకున్న కెప్టెన్
'బ్రెజిల్ ప్రజలారా! మమ్మల్ని క్షమించండి' అంటూ ఆ దేశ ఫుట్ బాల్ కెప్టన్ డేవిడ్ లూయిజ్ వేడుకున్నాడు. సెమీఫైనల్ లో జర్మనీ తో ఓటమి అనంతరం స్టేడియంలో బాధతో జట్టు సభ్యులంతా కూలబడిపోయారు. తామంతా బ్రెజిల్ ప్రజల ముఖాల్లో విజయానందం చూడాలని భావించామని, అంతా తల్లకిందులై ఘోరమైన పరాజయ భారంతో కుమిలిపోతున్నామని అన్నాడు. ఈ రోజు తమ జీవితాల్లో అత్యంత దురదృష్టకరమైన రోజని లూయిజ్ చెప్పాడు. జర్మనీ మెరుగ్గా ఆడిందని, తమతో పోరుకు జర్మనీ ఆటగాళ్లు సరిగ్గా సన్నద్ధమయ్యారని లూయిజ్ పేర్కొన్నాడు. కాగా వందేళ్ల ఫుట్ బాల్ చరిత్రలో బ్రెజిల్ కు ఇదే ఘోరమైన ఓటమి!