: నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి


తల్లిదండ్రులతో కలిసి హాయిగా పొలం వెళ్లి వద్దామనుకున్న ఇద్దరు చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం సూర్యతండాలో ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన శ్రీరాములు దంపతులు పొలం పనులకు వెళుతున్న క్రమంలో తమ ఇద్దరు పిల్లలు పూజిత (4), సంతోష్ నాయక్ (3)లను కూడా వెంట తీసుకెళ్లారు. పొలం పనుల్లో ఆ దంపతులు నిమగ్నమయ్యారు. ఈ లోగా నీటి కోసం గుంట వద్దకెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంటలో పడి మృతి చెందారు. ఉన్న ఇద్దరు పిల్లలు ఒకేసారి మృత్యువాత పడటంతో్ ఆ దంపతుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న తండా వాసులు విషాదంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News