: ఆ వ్యాఖ్యలపై స్పీకర్ ను క్షమాపణలు కోరిన కల్యాణ్ బెనర్జీ
'మీరు బీజేపీ స్పీకర్ కాదు, నరేంద్ర మోడీ స్పీకర్' అంటూ స్పీకర్ సుమిత్రామహాజన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ క్షమాపణలు చెప్పారు. రైల్వే బడ్జెట్ లో పశ్చిమబెంగాల్ కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తృణమూల్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన సభ నుంచి బయటకి వెళ్లి తనను బీజేపీ ఎంపీ బెదిరించారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.