: షిరిడీ సాయి ఆలయంలో గార్డు చేతివాటం
షిరిడీలోని సాయినాథుని ఆలయంలో దినకర్ హనుమంత్ డోఖే (58) అనే సెక్యూరిటీ గార్డు చేతివాటం ప్రదర్శించాడు. షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్టుకు చెందిన కానుకల కౌంటింగ్ హాల్ నుంచి ఈ గార్డు బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. తనిఖీల వేళ ఇతని నుంచి గ్రాము బంగారు నాణెం, మరో మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. డోఖేను అరెస్టు చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ట్రస్టుకు సంబంధించిన ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే ఈ గార్డును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ట్రస్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పా సాహెబ్ షిండే తెలిపారు.