: ఇరాక్ లో జిహాదీలుగా 18 మంది ఇండియన్లు
ఇరాక్ లో 18 మంది భారతీయులు జీహాదీలుగా పనిచేస్తున్నారని భారత నిఘా వర్గాలు నిర్ధారణకొచ్చాయి. జిహాదీ పోరులో పాల్గొనేందుకే వారు భారత్ నుంచి ఇరాక్, సిరియాలకు వెళ్లి ఉంటారని ఆ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా ఈ తరహా పోరాటాల్లో తమ దేశ పౌరులు పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇరాక్ లో జిహాదీలుగా పనిచేస్తున్న భారతీయులు స్థానిక ఉగ్రవాద గ్రూపుల నుంచి వలస వెళ్లి ఉండరని చెబుతున్నప్పటికీ, ఇరాక్ చేరుకున్న తర్వాత వారిని ఉగ్రవాదులు ఏ విధంగా ఆకర్షించి ఉంటారన్న విషయంపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. నిఘా వర్గాలు గుర్తించిన 18 మంది భారతీయుల్లో ఆరుగురు సిరియా తదితర ఇస్లామిక్ దేశాలకు వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు.