: తెలంగాణ ఎంఎస్ వోలకు జవదేకర్ అల్టిమేటం
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్ళ ప్రసారాల నిలిపివేతపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ఎంఎస్ వోలు, కేబుల్ ఆపరేటర్లకు ఒక్కరోజు సమయమిస్తున్నామని, ఆ లోగా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావుతో మాట్లాడుతూ జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుకు లేఖ రాసి రెండు వారాలైందని, అయినా, పరిస్థితిలో మార్పు రాలేదని జవదేకర్ పేర్కొన్నారు.