: తిరుపతిలో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు తిరుపతిలో పర్యటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలోని సెనేట్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతికి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులతోనూ చర్చిస్తోంది. కొత్త రాజధాని ఏర్పాటుపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులతో కమిటీ భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.