: వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభం


వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ ప్రారంభమైంది. ఆ వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అటు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2013-14కు సంబంధించిన ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టారు. 2012-13, 2013-14 వృద్ధిరేటు 5 శాతానికి తక్కువగానే ఉందని, 2014-15లో వృద్ధిరేటు 5.4 నుంచి 5.9శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. దేశీయ, బాహ్య పరిణామాల వల్ల ఆర్థికవృద్ధి మందగించిందనీ, ఇక 2013-14లో వ్యవసాయ, అనుబంధ రంగాలు 4.7శాతం వృద్ధిని నమోదు చేశాయని అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News