: టీ సచివాలయం ముట్టడికి ఏఐఎస్ఎఫ్ యత్నం... విద్యార్థుల అరెస్టు


ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్ కు తరలించారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ను మరో రెండు నెలలు వాయిదా వేయాలంటూ మూడు రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News