: 'ఎంపీ ఇంట్లో చోరీ' కేసులో ట్విస్ట్
బీహార్లో బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ నివాసంలో చోరీ కేసు ఆసక్తికరంగా మలుపుతిరిగింది. ఈ చోరీ వ్యవహారంలో పోలీసులు దినేశ్ కుమార్ అనే దొంగను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 1 కోటి 14 లక్షల రూపాయల నగదు, 600 డాలర్లు, రెండు బంగారు గొలుసులు, రెండు బంగారు చెవి కమ్మలు, ఓ గోల్డ్ లాకెట్, మూడు బంగారు ఉంగరాలు, 14 వెండి నాణేలు, 7 లగ్జరీ వాచ్ లు రికవరీ చేశారు. అయితే, తన ఇంట్లో కేవలం కొద్దిమొత్తంలోనే నగదు, నగలు మాయమయ్యాయని ఎంపీ పేర్కొనగా, ఈ కేసులో పోలీసులకు పట్టుబడ్డ దొంగ వద్ద కోటికిపైగా పట్టుబడడం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో ఇన్ కమ్ టాక్స్ విభాగం రంగప్రవేశం చేసింది. ప్రస్తుతం ఎంపీగారి ఆస్తుల వివరాలు పరిశీలిస్తోంది.