: చంద్రబాబు ఇప్పట్లో నడవరా?
'వస్తున్నా మీకోసం' పేరుతో నెలల తరబడి పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ల నొప్పులు, అరికాలి మంటలు, చీలమండ వాపు ఆయనను తీవ్రంగా బాధపెడుతున్నాయి. దీంతో ఈరోజు ఆర్ధోపెడిక్ వైద్యుల బృందం బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న పరీక్షలు చేసిన వైద్యులు కాలినొప్పి తీవ్రంగా ఉందని విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న బాబు రెండురోజులు విరామం ప్రకటించారు. మరి ఈరోజు నిర్వహించే వైద్య పరీక్షల్లో డాక్టర్లు ఏం చెబుతారోనని టీడీపీ నేతల్లో ఉత్కఠ నెలకొంది.