: మూడవరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడవరోజు ప్రారంభమయ్యాయి. వెంటనే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మహిళా ఎంపీపై బీజేపీ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారంటూ నిన్న (మంగళవారం) వారు సభలో ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై ఈ రోజు కూడా తీవ్ర నిరసన తెలుపుతున్నారు. దాంతో, సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.