: హైదరాబాదులో సీఎన్జీ కొరత... వాహనాలు ఎక్కడివక్కడే!
హైదరాబాదులో సీఎన్జీ కొరత తీవ్రమైంది. పైపుల మరమ్మతుల కారణంగా సరఫరా నిలిచిపోవడంతో బంకులు మూతపడ్డాయి. దీంతో, సీఎన్జీ ఆధారిత వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 25 వేల ఆటోలు నిలిచిపోగా, 100 ఆర్టీసీ సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పైపుల మరమ్మతుకు ఇంకా నాలుగు రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాలో ఇబ్బందులు తప్పేట్టులేవు.