: కావలి ఎమ్మెల్యే అరెస్టుకు అధికారుల సమాయత్తం
నకిలీ మధ్యం కేసులో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అరెస్టుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. ప్రతాపరెడ్డి ఇటీవల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. కాగా, గతరాత్రే ఎమ్మెల్యేను అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి.