: దైవదర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు..!
హైదరాబాదుకు చెందిన ఓ యువకుడు దైవదర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు! గౌతం నగర్ డివిజన్ లోని మధుసూదన్ నగర్ వాసి సందీప్ కుమార్ (22) మల్కాజ్ గిరి చైతన్య కాలేజిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీశైలం సమీపంలోని లుద్ధిమల్లయ్యస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. అయితే, అక్కడ నీటిలో దిగి స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. దీంతో, సందీప్ బంధుమిత్రుల్లో తీవ్ర విషాదం నెలకొంది.