: ప్రయాణికుల ఆకలి తీర్చిన పైలెట్
అమెరికాలో వాషింగ్టన్ నుంచి డెన్వర్ వెళుతున్న ఓ విమానం కాస్తా భారీ వర్షాల దృష్ట్యా షియెన్నేలో ల్యాండవ్వాల్సి వచ్చింది. ఆ విమానంలో 160 మంది ప్రయాణికులున్నారు. గంటలకొద్దీ వేచి ఉన్నా పరిస్థితులు మెరుగుపడలేదు. ఓవైపు ప్రయాణికులు ఆకలి కేకలు వేయడం మొదలెట్టారు. దీంతో, విమాన పైలెట్ మనసు కరిగిపోయింది. వెంటనే స్థానికంగా ఉన్న డొమినోస్ పిజ్జా ఔట్ లెట్ కు ఫోన్ చేసి ఆర్డర్ బుక్ చేశాడు. అయితే, డొమినోస్ సిబ్బంది అప్పటికే ఇళ్ళకు చేరుకున్నారట. డొమినోస్ మేనేజర్ ఆండ్రూ రిచీ వారికి ఫోన్ చేసి... "మీరు రావాల్సి ఉంటుంది, ఓ ఆర్డర్ వెయిట్ చేస్తోంది" అని చెప్పాడట. వారు రావడం, ఆగమేఘాలపై పిజ్జాలు తయారుచేసి విమానంలోని ప్రయాణికులకు అందించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం, కాసేపటికి వాతావరణం మెరుగుపడడంతో ఆ ఫ్లయిట్ గాల్లోకెగిరింది.