: పంజా విసిరిన 'నియొగురి'
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ టైఫూన్ 'నియొగురి' జపాన్ ఒకినావా దీవులపై పంజా విసిరింది. 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా, 46 అడుగుల ఎత్తున లేచిన భారీ అలలతో ఈ టైఫూన్ విరుచుకుపడడంతో అక్కడి ప్రజలు భీతావహులయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు మరణించగా, ఐదు లక్షలమంది సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఓవైపు కుండపోతగా వర్షం పడుతున్న నేపథ్యంలో విమానసర్వీసులను నిలిపివేశారు. 'నియొగురి' జపాన్ భూభాగాన్ని కూడా తాకే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ విభాగం హెచ్చరించింది.