: జర్మనీ ఫార్వర్డ్ వరల్డ్ రికార్డు
జర్మనీ జట్టులోని వెటరన్ ఫార్వర్డ్ మిరోస్లావ్ క్లోజ్ (36) వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ప్రపంచకప్ సాకర్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. బ్రెజిల్ తో సెమీస్ లో చేసిన గోల్ తో క్లోజ్ ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నీల్లో 16 గోల్స్ సాధించాడు. తద్వారా, బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో (15) రికార్డును తెరమరుగు చేశాడు.