: ధోనీ ప్లాన్ మార్చాడా..?
పైకి ఏమీ ఫీలింగ్స్ కనిపించనీయకపోయినా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తుపాను వేగంతో ఆలోచిస్తుంటాడు. అందుకే విజయవంతమైన కెప్టెన్ గా మన్ననలందుకుంటున్నాడు. ఇప్పుడు ధోనీ వ్యూహచతురతకు ఇంగ్లండ్ సిరీస్ పరీక్షగా నిలవనుంది. ఇప్పటివరకు నలుగురు బౌలర్ల వ్యూహంతో బరిలో దిగిన భారత్, నేడు కుక్ సేనతో తొలి టెస్టులో రూటు మార్చనుంది. ఐదుగురు బౌలర్లతో రంగంలోకి దిగితే ఎలా ఉంటుందని ధోనీ యోచిస్తున్నాడు. ఎప్పటికప్పుడు మారుతుండే ఇంగ్లండ్ వాతావరణం పిచ్ కండిషన్ పై తప్పక ప్రభావం చూపుతుందని ధోనీ భావిస్తున్నాడు. ఇటీవల కాలంలో చాలా జట్లు ఐదుగురు బౌలర్లతోనే రంగంలోకి దిగుతున్నాయని, ఏదేమైనా బుధవారం పిచ్ పరిస్థితి చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ధోనీ మీడియాకు తెలిపాడు.