: నేడు లోక్ సభలో పోలవరం బిల్లు గట్టెక్కేనా..?
పోలవరం బిల్లుపై నేడు లోక్ సభలో చర్చ, ఓటింగ్ నిర్వహించనున్నారు. నిన్న, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు'ను లోక్ సభలో ప్రవేశపెట్టగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపేస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చినా దాని చెల్లుబాటు ఆరు నెలలే. దీంతో, ఆ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం బిల్లు తెచ్చింది. ఈ బిల్లు ప్రవేశపెట్టగానే టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ సభ్యులకు తోడు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బిల్లుపై నేడు చర్చ, ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.