: నేమార్ కు కేరళ ఆయుర్వేద చికిత్స..?


ఫిఫా వరల్డ్ కప్ లో తీవ్రంగా గాయపడిన బ్రెజిల్ సూపర్ ఫార్వర్డ్ నేమార్ కేరళ రానున్నాడా..? ఇప్పుడు కేరళలో ఇదే హాట్ టాపిక్. ఈ వరల్డ్ స్టార్ తన వెన్నెముక గాయానికి కేరళ సంప్రదాయ ఆయుర్వేద చికిత్స తీసుకోనున్నాడని టీవీ చానళ్ళు ఊదరగొట్టాయి. ఈ మేరకు నేమార్ కేరళ సీఎం ఊమెన్ చాందీతోనూ సంప్రదించాడని పేర్కొన్నాయి. ఈ కథనాలపై సీఎం చాందీ స్పందిస్తూ, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే, నేమార్ ను చికిత్స నిమిత్తం కేరళ ఆహ్వానించాలని కేరళ ఫుట్ బాల్ ఫ్యాన్స్ కోరారని వెల్లడించారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి వీఎస్ శివకుమార్ తో మాట్లాడానని, ఇంటర్నెట్లో నేమార్ గాయం వివరాలు తెలుసుకోవాలని ఆయన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు సూచించారని చాందీ తెలిపారు. ఈ విషయమై బుధవారం మరింత వివరణ ఇస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News