: శాంసంగ్ యూనిట్ లో భారీ దోపిడీ


బ్రెజిల్లోని సావోపాలో వద్ద శాంసంగ్ యూనిట్ లో భారీ దోపిడీ చేసుకుంది. సోమవారం రాత్రి ఫ్యాక్టరీలోకి చొరబడిన 20 మంది సాయుధులు 40,000 సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ట్రక్కుల్లో నింపుకుని పరారయ్యారు. వీటి విలువ రూ.215 కోట్లు ఉంటుంది. దోపిడీకి ముందు దొంగలు యూనిట్ వద్దకు నైట్ షిఫ్ట్ ఉద్యోగులను తీసుకువస్తున్న బస్సుపై దాడి చేశారు. ఉద్యోగుల్లో ఇద్దరిని తీసుకుని ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. వారిని అడ్డుపెట్టుకుని యూనిట్లోకి ప్రవేశించారు. అనంతరం, సెక్యూరిటీ వారిని బెదిరించి ఆయుధాలను లాగేసుకున్నారు. ఫ్యాక్టరీలో మూడుగంటల పాటు స్వైర విహారం చేసిన దొంగలు పనిపూర్తిచేసుకుని పరారయ్యారు.

  • Loading...

More Telugu News