: పోలవరం ఆర్డినెన్స్ కు నేను వ్యతిరేకం: వైసీపీ తెలంగాణ ఎంపీ
పోలవరం ఆర్డినెన్స్ కు తాను వ్యతిరేకినని వైఎస్సార్సీపీకి చెందిన తెలంగాణ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండాలని ఆయన అన్నారు. అటు ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ పార్టీ పోలవరం ఆర్డినెన్స్ కు అనుకూలంగా ఉందన్నారు. ముంపు ప్రాంతాలు ఏపీలో చేర్చే సవరణకు సుముఖమని పేర్కొన్నారు.