: ప్చ్... ఈ బడ్జెట్ ఏం బాలేదు!: తెలంగాణ సీఎం కేసీఆర్
రైల్వేబడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా లేదని ఆయన అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కు రూ.20 కోట్ల నిధులు సరిపోతాయా? అని ఆయన ప్రశ్నించారు.