: తెలంగాణ పోలీసులు, రైల్వే పోలీసుల మధ్య వివాదం
సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ ను ఆనుకుని ఉన్న 8 ఎకరాల భూమిపై కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రాజుకుంది. ఆ భూమి తమదంటే తమదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు వాగ్వాదానికి దిగారు. దీంతో తెలంగాణ అధికారులు పెద్దఎత్తున పోలీసులను రంగంలోకి దించారు. ఈ పరిణామంతో రైల్వే పోలీసులు కూడా పెద్దఎత్తున పోగయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలను రైల్వే పోలీసులు కూల్చేశారు. ఉన్నతాధికారుల జోక్యంతో ఇరు వర్గాల పోలీసులను ఉపసంహరించుకున్నారు.