: నిండుసభలో చీరలాగుతానన్నాడు...పార్లమెంటు వీధి బాగోతం కథ!
నాడు నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం గావించి కౌరవులు ఆమెను ఎలా అవమానించారో, అలాగే పార్లమెంటులో తమ పార్టీ మహిళా ఎంపీ కకోలి ఘోస్ చీరలాగుతానని ఓ బీజేపీ ఎంపీ బెదిరించాడని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పార్లమెంటు బయట ఆయన మాట్లాడుతూ, తమను బీజేపీ ఎంపీలు అభ్యంతరకర పదజాలంతో దూషించారని, తమపై దాడి చేసేందుకు యత్నించారని అన్నారు. వారి బారి నుంచి రక్షణపొందేందుకు తాము బయటకు పరుగెత్తామని ఆయన వెల్లడించారు. కాగా, సదరు బీజేపీ ఎంపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.