: ఎన్నికల అధికారే గైర్హాజరు...ఎన్నిక వాయిదా...మత్స్యకారుల ఆందోళన
ఈ రోజు విజయనగం జిల్లాలో మత్స్యకార సొసైటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల నిర్వహణాధికారి గైర్హాజరయ్యారు. దీంతో ఈ సొసైటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. మత్స్యకార సొసైటీలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు అధికంగా ఉండడం వల్లే సొసైటీ ఎన్నికల వాయిదాకు టీడీపీ కుట్రపన్నిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దీంతో మత్స్యకారులు ఎన్నికలు తక్షణం నిర్వహించాలని ఆందోళన నిర్వహించారు.